Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:24 AM

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు

05-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: మండలంలోని మిర్జాపూర్ (బి) గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని గ్రామస్థులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు రాయికోడ్, వట్పల్లి వైపు వెళ్తున్నప్పటికీ తమ గ్రామంలో నిలపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు కలిసి కొంతసేపు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే బస్సులను గ్రామంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ డిపో అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన హామీతో గ్రామస్థులు తమ ఆందోళనను విరమించడంతో బస్సుల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరాయి.

Sthanikam

బస్సులు ఆగకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News