Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:10 PM

బస్‌స్టాండ్‌లో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు విద్యార్థులు.. ఆర్టీసీ కార్గో నిర్వాహకుడి చాకచక్యంతో హాస్టల్‌కు చేరిక

21-07-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సమయస్ఫూర్తితో స్పందించిన దశరథ.. తప్పించుకువచ్చిన గురుకుల విద్యార్థులు సురక్షితం.

చిట్యాల బస్‌స్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు గురుకుల విద్యార్థులను గుర్తించి, వారిని సురక్షితంగా హాస్టల్ సిబ్బందికి అప్పగించిన ఆర్టీసీ కార్గో నిర్వాహకుడు తన బాధ్యతాయుత వైఖరితో ప్రశంసలు అందుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరు విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తిరిగి తమ హాస్టల్‌కు చేరుకున్నారు.

వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చిట్యాల బస్‌స్టాండ్‌లో ఇద్దరు బాలురు బ్యాగులు వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. చాలా సేపటి నుంచి వారు అక్కడే ఉండటాన్ని గమనించిన టీజీఎస్ ఆర్టీసీ కార్గో నిర్వాహకుడు పొలిమేర దశరథ వారిని పలకరించి వివరాలు అడిగారు.

మొదట కొంత సంకోచించిన బాలురు, అనంతరం దశరథ ప్రేమగా మాట్లాడటంతో అసలు విషయం వెల్లడించారు. తాము రామన్నపేట ఎస్సీ గురుకుల హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చామని తెలిపారు.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన దశరథ వెంటనే గురుకుల హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం బాలురను తన పర్యవేక్షణలో ఉంచి, హాస్టల్ సిబ్బంది వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. సిబ్బంది చిట్యాలకు చేరుకున్న తర్వాత విద్యార్థులను వారికి అప్పగించారు.సమయానికి స్పందించి ఇద్దరు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన పొలిమేర దశరథను స్థానికులు, ప్రయాణికులు, గురుకుల సిబ్బంది అభినందించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే పరిస్థితుల్లో ఆయన చూపిన చొరవ ఆదర్శప్రాయమని పలువురు పేర్కొన్నారు.

Sthanikam

బస్‌స్టాండ్‌లో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు విద్యార్థులు.. ఆర్టీసీ కార్గో నిర్వాహకుడి చాకచక్యంతో హాస్టల్‌కు చేరిక

Article Image

సమయస్ఫూర్తితో స్పందించిన దశరథ.. తప్పించుకువచ్చిన గురుకుల విద్యార్థులు సురక్షితం.

చిట్యాల బస్‌స్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు గురుకుల విద్యార్థులను గుర్తించి, వారిని సురక్షితంగా హాస్టల్ సిబ్బందికి అప్పగించిన ఆర్టీసీ కార్గో నిర్వాహకుడు తన బాధ్యతాయుత వైఖరితో ప్రశంసలు అందుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరు విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తిరిగి తమ హాస్టల్‌కు చేరుకున్నారు.

వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చిట్యాల బస్‌స్టాండ్‌లో ఇద్దరు బాలురు బ్యాగులు వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. చాలా సేపటి నుంచి వారు అక్కడే ఉండటాన్ని గమనించిన టీజీఎస్ ఆర్టీసీ కార్గో నిర్వాహకుడు పొలిమేర దశరథ వారిని పలకరించి వివరాలు అడిగారు.

మొదట కొంత సంకోచించిన బాలురు, అనంతరం దశరథ ప్రేమగా మాట్లాడటంతో అసలు విషయం వెల్లడించారు. తాము రామన్నపేట ఎస్సీ గురుకుల హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చామని తెలిపారు.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన దశరథ వెంటనే గురుకుల హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం బాలురను తన పర్యవేక్షణలో ఉంచి, హాస్టల్ సిబ్బంది వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. సిబ్బంది చిట్యాలకు చేరుకున్న తర్వాత విద్యార్థులను వారికి అప్పగించారు.సమయానికి స్పందించి ఇద్దరు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన పొలిమేర దశరథను స్థానికులు, ప్రయాణికులు, గురుకుల సిబ్బంది అభినందించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే పరిస్థితుల్లో ఆయన చూపిన చొరవ ఆదర్శప్రాయమని పలువురు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News