Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశాలు ఇవ్వాలి. సిపిఐ – ఈవోకు వినతి పత్రం

19-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారులకు ప్రదర్శనలలో అవకాశం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు. ఆదివారం సిపిఐ ప్రతినిధి బృందం దేవస్థానం ఈవో భవాని శంకర్‌కు వినతి పత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా నాట్యమండలి కళాకారులు సమాజ సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు. అలాంటి కళాకారులకు బ్రహ్మోత్సవాల వంటి వేదికల్లో అవకాశాలు కల్పిస్తే సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.

యాదగిరిగుట్ట కొండపై ఉన్న పలు స్థానిక సమస్యలను కూడా ఈవో దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈవో హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేష్, ఎండీ ఇమ్రాన్, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశాలు ఇవ్వాలి. సిపిఐ – ఈవోకు వినతి పత్రం

Article Image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారులకు ప్రదర్శనలలో అవకాశం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు. ఆదివారం సిపిఐ ప్రతినిధి బృందం దేవస్థానం ఈవో భవాని శంకర్‌కు వినతి పత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా నాట్యమండలి కళాకారులు సమాజ సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు. అలాంటి కళాకారులకు బ్రహ్మోత్సవాల వంటి వేదికల్లో అవకాశాలు కల్పిస్తే సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.

యాదగిరిగుట్ట కొండపై ఉన్న పలు స్థానిక సమస్యలను కూడా ఈవో దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈవో హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేష్, ఎండీ ఇమ్రాన్, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News