శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం–1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీశ్ కుమార్, ఏఎస్పీ అంకితా సూరన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్పీ సతీశ్ కుమార్ మాట్లాడుతూ, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వెట్టి చాకిరీకి గురయ్యే వారిని గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.
PRINT TIME: October 09, 2026 04:39 AM
బానిస కార్మిక వ్యవస్థ పై అవగాహనా సదస్సు
బానిస కార్మిక వ్యవస్థ పై అవగాహనా సదస్సు
02-06-2026
45 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం–1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీశ్ కుమార్, ఏఎస్పీ అంకితా సూరన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్పీ సతీశ్ కుమార్ మాట్లాడుతూ, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వెట్టి చాకిరీకి గురయ్యే వారిని గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి