Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:52 AM

బాలికపై అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్‌పై పోక్సో కేసు

20-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కఠిన చర్యలకు ఆదేశించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్.

నల్లగొండ పట్టణంలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో పోలీసు శాఖకు చెందిన ఓ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదవడం సంచలనంగా మారింది. గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణపై నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వన్‌టౌన్ పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్‌కు తరలించి జైలుకు పంపించారు.ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్, నిందిత కానిస్టేబుల్ సత్యనారాయణను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాలల రక్షణకు సంబంధించిన కేసుల్లో ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, పోలీసు శాఖలోనూ కలకలం రేపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

బాలికపై అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్‌పై పోక్సో కేసు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News