Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా చిట్యాలలో మోదీ దిష్టిబొమ్మ దహనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 01:16 PM

బాలిక వేధింపుల కేసులో కానిస్టేబుల్ అరెస్ట్..! పోక్సో చట్టం కింద కేసు నమోదు – సీసీటీవీ ఆధారంగా నిందితుడి గుర్తింపు

బాలిక వేధింపుల కేసులో కానిస్టేబుల్ అరెస్ట్..! పోక్సో చట్టం కింద కేసు నమోదు – సీసీటీవీ ఆధారంగా నిందితుడి గుర్తింపు

బాలిక వేధింపుల కేసులో కానిస్టేబుల్ అరెస్ట్..! పోక్సో చట్టం కింద కేసు నమోదు – సీసీటీవీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
July 20, 2026 08:21 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

గుర్రంపోడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌గా తేలిన నిందితుడు – శాఖాపరమైన పర్యవేక్షణపై ప్రశ్నలు

నల్లగొండ పట్టణంలో బాలిక వేధింపుల కేసులో ఓ పోలీసు కానిస్టేబుల్ అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపింది. సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలికను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా వన్‌టౌన్ పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల నల్లగొండ పట్టణంలో సైకిల్‌పై వెళ్తున్న బాలికను ఓ వ్యక్తి అడ్డగించి వేధించినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు.

దర్యాప్తులో నిందితుడు తన గుర్తింపును దాచుకునేందుకు మాస్క్ ధరించి సంచరించినప్పటికీ, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు మరియు ఇతర సమాచారంతో పోలీసులు అతడిని గుర్తించినట్లు తెలుస్తోంది. విచారణలో నిందితుడు గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి అని తేలినట్లు సమాచారం. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో నిందితుడి గత చరిత్రపై కూడా చర్చ మొదలైంది. అతడిపై గతంలో కూడా పోక్సో చట్టం కింద కేసులు నమోదైనట్లు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ పలుమార్లు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా సంబంధిత అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి వరుసగా పోస్టింగులు ఎలా లభించాయనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. శాఖాపరమైన పర్యవేక్షణలో లోపాలున్నాయా అనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. నిందితుడిపై గతంలో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను బహిర్గతం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఘటనపై ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితుడిపై చట్టపరంగా, శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. బాలికలు, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, చట్టం ముందు ఎవరైనా సమానమేనని అధికారులు పేర్కొంటున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News