Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 AM

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి

21-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిత్తూరు జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దంపతులు, వారి చిన్నారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు.

చింతలగుంట గ్రామానికి చెందిన హేమచంద్ర (40), సరస్వతి (36) దంపతులు తమ కుమార్తె లలిత (10)తో కలిసి యడగుర్కి గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలో కొమ్మరమడుగు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా కుటుంబం అంతరించిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

బైక్‌ను ఢీకొట్టిన లారీ... దంపతులతోపాటు కుమార్తె మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News