బహుజన ఉద్యమానికి మార్గదర్శకుడు, మహానేత మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా దళిత రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కర్మన్ ఘట్ని లో ఘనంగా వాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య శిబిరం (హెల్త్ క్యాంపు) నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నాయకులు, కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బి. సురేష్, ఉపాధ్యక్షులు ఆడపు లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు అరుణతో పాటు నాయకులు ఎ. మధు, వినోద్, రాజేష్, నరేష్, నక్క కృష్ణ, ఇస్లావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి