Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 01:34 AM

బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం..

బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం..

బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం..
June 02, 2026 01:00 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై కేసీఆర్ నాయకత్వంలో పోరాటం..

అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు ఘన నివాళి..

గులాబీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రతిజ్ఞ..

నల్లగొండ : ఎందరో అమరవీరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేశామని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోతోందని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై, ప్రజల ఆత్మగౌరవం కోసం గులాబీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాజీలేని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులచే ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

అమరవీరులకు శ్రద్ధాంజలి..

​అంతకుముందు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, చెరుకు సుధాకర్, ఏనుగుల రాకేష్ రెడ్డి, చీర పంకజ్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రు నాయక్, పల్లె రవికుమార్, మాలే శరణ్యారెడ్డి, సింగం రామ్మోహన్ తదితరులు పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద గల అమరవీరుల స్మారక స్తూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం శ్రీకాంతాచారి విగ్రహానికి, ఎన్‌జీ కాలేజీ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు..

​సరికొత్త నృత్య రీతులతో నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ ప్రతినిధి కళ్యాణి శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పేలా సాగిన ఈ ప్రదర్శనల అనంతరం ముఖ్య అతిథులు కళాకారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, తిప్పర్తి, నల్లగొండ, కనగల్ మండలాల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరి దీపికా ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్, మరియు ముఖ్య నాయకులు సయ్యద్ జాఫర్ జమాల్ ఖాద్రి, అఫ్జల్ ఖాన్, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, తవిటి కృష్ణ, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, కడారి కృష్ణయ్య, సింగం లక్ష్మి, మామిడి పద్మ, యాట జయప్రద రెడ్డి, కొండ్ర స్వరూప, మల్లికాంబ, కంచర్ల విజయరెడ్డిలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల సర్పంచులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News