Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

బడుగు బలహీనుల కోసం పోరాడిన పాపన్నకు నివాళి

02-04-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: సర్దార్ సర్వాయి పాపన్న 316వ వర్ధంతి సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బావాండ్లపల్లి బాలరాజు, మండల అధ్యక్షులు కూమారు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు మునికుంట్ల లెనిన్ పాల్గొని పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్న వరంగల్ జిల్లా (ప్రస్తుతం జనగాం జిల్లా) రఘునాథపల్లి మండలం ఖిలసాపురం గ్రామంలో జన్మించారని తెలిపారు. బాల్యంలోనే పశువులు కాస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గమనించిన పాపన్న, యుక్త వయసులోనే అభ్యుదయ భావజాలాన్ని అలవర్చుకున్నారని పేర్కొన్నారు.

అన్ని కులాలు, వర్గాల వారితో స్నేహపూర్వకంగా మెలిగిన పాపన్న, పెత్తందారి వర్గాలు, జమీందారులు, దొరలు, భూస్వాముల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. గోల్కొండ కోటపై బడుగు బలహీన వర్గాల జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉద్యమం చేపట్టిన మహా వీరుడని కొనియాడారు.

1675లో సర్వాయిపేటలో స్వరాజ్యాన్ని స్థాపించి, పదివేల మందికి పైగా గరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప యోధుడిగా పాపన్న చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బైరు రమేష్, పబ్బు స్వామి, అడ్వకేట్ కూనూరు శ్రీనివాస్, బాలగోని మల్లయ్య, బైరు శంకరయ్య, గంగాపురం యాదయ్య, గుండు లింగయ్య, చెరుకు శివరాజ్, వీరమల్ల ముత్తయ్య, వీరమల్ల నరసింహ, కొండ రాములు, కూనూరు అంజన్ కుమార్, నకిరేకంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బడుగు బలహీనుల కోసం పోరాడిన పాపన్నకు నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News