Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:13 PM

బాధితులకు ‘సీఎంఆర్‌ఎఫ్‌’ కొండంత అండ

బాధితులకు ‘సీఎంఆర్‌ఎఫ్‌’ కొండంత అండ

బాధితులకు ‘సీఎంఆర్‌ఎఫ్‌’ కొండంత అండ
22-07-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దండు మల్కాపూర్‌లో సహాయ నిధి చెక్కుల పంపిణీ

అత్యవసర వైద్య చికిత్సలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కొండంత అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ దండు మల్కాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు మెంబర్ సుక్క రవీందర్ తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసుతో గ్రామానికి చెందిన పలువురు బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బుధవారం గ్రామ నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.

​గ్రామానికి చెందిన బోయిని స్వరూప 56,000, జొన్నగంటి జంగయ్య 45,000, పేరుమాండ్ల అచ్చమ్మ 35,000, బుర్ర దేవి 17,000 చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేసినట్లు నాయకులు తెలిపారు. ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేయించి ఆదుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మీసాల నర్సింహ, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్, ఏఎంసీ డైరెక్టర్ మహమ్మద్ గౌస్ ఖాన్, వార్డు మెంబర్లు ఈడ్దుల ఇంద్రసేన యాదవ్, అత్తపురం సంతోష అంజిరెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మునుకుంట్ల రాజు గౌడ్, దేవాలయ ధర్మకర్తలు ఈడ్దుల బాబు యాదవ్, దౌడి లింగస్వామి, పార్టీ నాయకులు పీసరి యాదిరెడ్డి, మల్కాజ్గిరి నరసింహ, దౌడి వెంకటేష్, ఈడ్దుల కేశవ్ యాదవ్, బద్దుల నర్సింహ, ముదిగొండ మహేష్, బుర్ర శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధితులకు ‘సీఎంఆర్‌ఎఫ్‌’ కొండంత అండ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News