చర్లగూడెం భూనిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి
ఎమ్మాల్యేకు పదవులపై ఉన్న ధ్యాస సమస్యలపై లేదు: బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అభయేందర్
చర్లగూడెం భూనిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వాలు రాక్షస ఆనందం పొందుతున్నాయని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఐతరాజు అభయేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ప్రాజెక్టు వద్ద బీఎస్పీ మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలాలు, చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం ఫ్లోరైడ్ బారినపడి నలిగిపోతుంటే.. స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల ఆవేదన కంటే మంత్రి పదవి సాధించడమే ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు. భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొట్ట శివ, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుక్క రాములు, నారాయణపురం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, చౌటుప్పల్ మండల ఉపాధ్యక్షుడు మస్కు ఉదయ్, నాయకులు పల్లేటి రతివ, ఈద నరేష్, సురేష్, విజయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి