Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 08:53 AM

బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనే లక్ష్యం కావాలి..

బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనే లక్ష్యం కావాలి..

బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనే లక్ష్యం కావాలి..
April 05, 2026 01:14 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


దేశ నిర్మాణంలో ఆయన పాత్ర చిరస్మరణీయం..

119వ జయంతి వేడుకల్లో మేయర్‌ బుర్రి చైతన్యరెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్‌ నల్లగొండలో ఘనంగా నివాళులు..

నల్లగొండ : దేశంలో సామాజిక సమానత్వానికి అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్‌ అని నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఆదివారం జగ్జీవన్‌రామ్‌ 119వ జయంతిని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అంతకుముందు మర్రిగూడ బైపాస్ వద్ద, ఎన్ జి కళాశాల ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మేయర్‌ మాట్లాడుతూ.. భారత దేశ అణగారిన వర్గాల ఆశాకిరణం బాబు జగ్జీవన్‌రామ్. కేవలం 22 ఏళ్ల చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన గొప్ప దేశభక్తుడు. దేశ నిర్మాణంలో ఆయన పోషించిన పాత్ర వెలకట్టలేనిది. కేంద్ర మంత్రిగా కార్మిక, రక్షణ, వ్యవసాయ శాఖల్లో ఆయన చేపట్టిన సంస్కరణలు దేశాభివృద్ధికి బాటలు వేశాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


సాంకేతికతను అందిపుచ్చుకోవాలి..కలెక్టర్


​జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్మిక చట్టాల రూపకల్పనలో, ఇండో-పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఆయన చూపిన తెగువ అద్వితీయం. విద్యార్థులు చదువును కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా సమాజ హితం కోసం ఉపయోగించాలి అని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వినియోగించుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు.

ఈ వేడుకల్లో విశ్రాంత ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్ (రెవెన్యూ), వై. అశోక్ రెడ్డి (స్థానిక సంస్థల ఇన్చార్జి) తదితరులు పాల్గొని ప్రసంగించారు. జగ్జీవన్‌రామ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన చూపిన బాటలో నడవడం మనందరి కనీస బాధ్యత అని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, డి సి సి అధ్యక్షులు కైలాస్ నేత, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, మార్పాక నరేందర్, షణ్ముఖ కుమార్, కవితా రాణి, గోలి ఏడుకొండలు, పెరిక స్వాతి, జగన్ కుమార్, బొర్ర సుధాకర్, సంజీవయ్య, అవుట రవీందర్, చక్రహరి రామరాజు, లక్ష్మీనారాయణ, ఆదిరెడ్డి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News