Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:48 AM

అవసరం ఉన్న చోటే ఫ్లైఓవర్లు.. అవసరం లేని చోట వద్దు – ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

21-04-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

అవసరం ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించాలి. అవసరం లేని చోట ప్రజల ఇళ్లు కూల్చి ఫ్లైఓవర్లు నిర్మించడం సరికాదని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. చంపాపేట్ డివిజన్ పరిధిలోని ఓవైసీ చౌరస్తా నుంచి కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం వెళ్లే ప్రధాన రహదారిపై ప్రతిపాదించిన ఫ్లైఓవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ టీకేఆర్ కమాన్ చౌరస్తా నుంచి ఓవైసీ చౌరస్తా వరకు ఆరు లైన్ల విస్తరణ పేరిట దాదాపు 240 మందికి నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ ప్రాంతంలో 150 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్ అందుబాటులో ఉన్నప్పటికీ, మరోసారి 25 అడుగుల మేర రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లు కూల్చివేయాలని రావడం అన్యాయమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న తమను ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం వల్ల రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు.

ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. ప్రస్తుతం ఉన్న 150 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్ కారణంగా మరో 25 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం లేదన్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదని స్పష్టం చేశారు. బదులుగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా, హస్తినాపురం చౌరస్తాల వద్ద ఫ్లైఓవర్లు మంజూరు చేయాలని తాను గతంలో ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

“ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు మంజూరు చేయకుండా, ఇక్కడ ప్రజల ఇళ్లు కూల్చేలా ప్రతిపాదనలు తీసుకురావడం హాస్యాస్పదని ఆయన విమర్శించారు. స్థానికుల సమస్యను ప్రభుత్వం దృష్టికి పెద్దఎత్తున తీసుకెళ్లి, ప్రతిపాదిత ఫ్లైఓవర్‌ను నిలిపివేయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో భారస నాయకులు రాజిరెడ్డి, ముద్ద కళ్యాణ్, చలమల యాదిరెడ్డి, రవి ముదిరాజ్, ప్రభాకర్, కనకేష్, జంగయ్య, చందు, శ్రీనివాస్, రమాదేవి, కాలనీవాసులు జగదీశ్, నవరత్నం, నర్సింహా, సురేష్, శ్యామ్, శ్రీనివాస్ సాగర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అవసరం ఉన్న చోటే ఫ్లైఓవర్లు.. అవసరం లేని చోట వద్దు – ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News