Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

ఆటో డ్రైవర్ కన్నీరు… స్పందించిన ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి పరామర్శించిన పార్థసారథి

12-03-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: పోలీసుల జరిమానాల భారంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్‌కు ఎమ్మెల్యే పార్థసారథి అండగా నిలిచారు. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తిమ్మప్ప సోషల్ మీడియాలో తన బాధను వెల్లడించిన వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించారు.

రోజంతా కష్టపడితే రూ.400 నుంచి రూ.500 మాత్రమే సంపాదన వస్తోందని, అందులో ఎక్కువ భాగం పోలీసుల జరిమానాలకే వెళ్లిపోతోందని తిమ్మప్ప వాపోయాడు. తల్లి కూలి పనికి వెళ్లి సంపాదించే రూ.200తో కలిసి కుటుంబం అతికష్టం మీద గడుస్తోందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ జరిమానాలు విధిస్తే పేదలు ఎలా బతకాలని అధికారులను ప్రశ్నించాడు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి తిమ్మప్ప ఇంటికి వెళ్లి అతని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ పక్కనే కూర్చుని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిబంధనల పేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. తిమ్మప్ప లాంటి కష్టజీవులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని సీఎం, డీసీఎం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Sthanikam

ఆటో డ్రైవర్ కన్నీరు… స్పందించిన ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి పరామర్శించిన పార్థసారథి

Article Image

ఆదోని,: పోలీసుల జరిమానాల భారంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్‌కు ఎమ్మెల్యే పార్థసారథి అండగా నిలిచారు. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తిమ్మప్ప సోషల్ మీడియాలో తన బాధను వెల్లడించిన వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించారు.

రోజంతా కష్టపడితే రూ.400 నుంచి రూ.500 మాత్రమే సంపాదన వస్తోందని, అందులో ఎక్కువ భాగం పోలీసుల జరిమానాలకే వెళ్లిపోతోందని తిమ్మప్ప వాపోయాడు. తల్లి కూలి పనికి వెళ్లి సంపాదించే రూ.200తో కలిసి కుటుంబం అతికష్టం మీద గడుస్తోందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ జరిమానాలు విధిస్తే పేదలు ఎలా బతకాలని అధికారులను ప్రశ్నించాడు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి తిమ్మప్ప ఇంటికి వెళ్లి అతని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ పక్కనే కూర్చుని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిబంధనల పేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. తిమ్మప్ప లాంటి కష్టజీవులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని సీఎం, డీసీఎం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News