Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ — 44 ఏళ్ల ప్రస్థానం గర్వకారణం: మోరంపూడి శ్రీనివాసరావు

29-03-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, తెలుగోడి సత్తా, పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు.

ఒక ప్రాంతీయ పార్టీగా 44 సంవత్సరాలు నిరంతరంగా పటిష్టంగా కొనసాగడం చరిత్రలో అరుదైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. దీనికి పునాది వేసిన మహనీయుడు ఎన్టీ రామారావు అని, ఆ పునాదిపై బలమైన నిర్మాణాన్ని నిర్మించినది చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు విజయం సాధించడం టీడీపీ ప్రజల్లో ఉన్న బలాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకుడు కట్టుబాటుతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో జోష్‌గా సాగి, టీడీపీ శక్తిని మరోసారి చాటిచెప్పింది.

Sthanikam

ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ — 44 ఏళ్ల ప్రస్థానం గర్వకారణం: మోరంపూడి శ్రీనివాసరావు

Article Image

చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, తెలుగోడి సత్తా, పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు.

ఒక ప్రాంతీయ పార్టీగా 44 సంవత్సరాలు నిరంతరంగా పటిష్టంగా కొనసాగడం చరిత్రలో అరుదైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. దీనికి పునాది వేసిన మహనీయుడు ఎన్టీ రామారావు అని, ఆ పునాదిపై బలమైన నిర్మాణాన్ని నిర్మించినది చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు విజయం సాధించడం టీడీపీ ప్రజల్లో ఉన్న బలాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకుడు కట్టుబాటుతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో జోష్‌గా సాగి, టీడీపీ శక్తిని మరోసారి చాటిచెప్పింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News