Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో ఘోర వైఫల్యం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 07:51 PM

అటవీ భూములకు ‘డి-ఫాం’ పట్టాలివ్వండి..

అటవీ భూములకు ‘డి-ఫాం’ పట్టాలివ్వండి..

అటవీ భూములకు ‘డి-ఫాం’ పట్టాలివ్వండి..
04-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి..

విజయ విహార్‌లో భూ సమస్యలపై కలెక్టర్‌తో సమీక్షా సమావేశం..

నాగార్జున సాగర్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సాగర్ మండలంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు త్వరితగతిన డి-ఫాం పట్టాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి కోరారు. శనివారం సాగర్‌లోని విజయ విహార్‌లో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్‌తో కలిసి నియోజకవర్గ భూ సమస్యలపై ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులకు పట్టాలు లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్మెంట్ భూముల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే విన్నపంపై జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సానుకూలంగా స్పందిస్తూ అటవీ భూములకు పట్టాలిచ్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో ప్రస్తుతం సాగులో ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని గ్రామ స్థాయిలో సర్వే నిర్వహించి గ్రామ సభల ద్వారా ధృవీకరణ చేపడుతున్నామని వివరించారు. ఇప్పటివరకు సుమారు 12,000 ఎకరాల భూమికి సంబంధించిన సర్వే పూర్తయిందని

సర్వే నంబర్ల ఆధారంగా రికార్డులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.​ రైతుబంధు వంటి ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రజావాణి ద్వారా వచ్చే రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఫారెస్ట్ భూములకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి కె. జానారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అటవీ భూములకు ‘డి-ఫాం’ పట్టాలివ్వండి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News