Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి. సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి

02-04-2026 123 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

గురువారం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన , ఎమర్జెన్సీ, మెడికల్, లేబర్ రూమ్, ఇన్‌పేషెంట్ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన మందులను తొలగించాలని తెలిపారు. రోజువారీ ఓపీ, నెలవారీ డెలివరీలపై ఆరా తీశారు.

గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ఆశా వర్కర్ల ద్వారా అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.

ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, చెత్త తొలగించి మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. మనోహర్, డిసిహెచ్ఎస్ డాక్టర్ చిన్న నాయక్, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ శ్వేత ప్రియాంక,సివిల్ సర్జన్ డాక్టర్ వీరన్న, డాక్టర్ మాధవ్, డాక్టర్ అశ్విన్, గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటి రమేష్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలి. సమయానికి వైద్యం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News