Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన

19-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుర్రపుడెక్క ఆకులు తొలగించి కట్టకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్

రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామ పరిధిలోని అసిఫ్ నగర్ రాచకాలువ దుస్థితి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో గుర్రపుడెక్క ఆకులు, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోగా, కట్ట కూడా శిథిలావస్థకు చేరింది. వెంటనే శుభ్రపరిచే పనులు చేపట్టి కట్టను బలోపేతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీపీఎం పోరుయాత్రలో భాగంగా కాలువను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా ముసి నీరు రావడంతో కాలువలో చెత్త, మొక్కలు పెరిగి నీరు సరిగా వెళ్లడం లేదన్నారు. దీంతో నీరు పొలాల్లోకి చేరి పంటలకు నష్టం జరుగుతోందని తెలిపారు.

కింది పొలాలు జాలుబడిపోవడంతో దున్నడం, కోతలు కోయడం కష్టంగా మారిందన్నారు. భారీ వర్షాల సమయంలో కాలువ కట్టపై నుంచి నీరు పొర్లి గ్రామానికి ప్రమాదంగా మారుతుందని, పలు సందర్భాల్లో కట్ట తెగి నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు.

కాలువలో పేరుకుపోయిన ఆకులు తొలగించడం, కట్టకు పెరిగిన కంపచెట్లను తొలగించడం, మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తలుపునూరి శ్రీనివాస్, తాళ్లపల్లి జితేందర్, గంటెపాక శ్రీను, బూడిద నర్మదనర్సింహా, తొలుపునూరి చంద్రశేఖర్, గంటెపాక శివకుమార్, మేడి ముకుంద, ఎండి మైనొద్దీన్, ఉండ్రాతి నరసింహ, బూడిద బిక్షం, గునుగుంట్ల సత్యనారాయణ, మేడి భాషయ్య, గంటెపాక చిన్న ముత్యాలు, గంటెపాక శ్రీకృష్ణ, కనుకుంట్ల ఉపేందర్, పోగుల ఉపేందర్, బొడ్డుపల్లి ఉపేందర్, జంపాల మహేష్, బోనగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థ… రైతుల ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News