Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

ఆసరా పెన్షన్‌కు షరతులు వద్దు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలి: రాపోలు నరసింహ

13-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: సీనియర్ సిటిజన్లకు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని ఆల్ సీనియర్ సిటిజన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు నరసయ్య డిమాండ్ చేశారు. రామన్నపేట మండల సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు జెల్ల శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదని, భూములు ఉన్నాయని కారణాలు చూపుతూ కొంతమంది వృద్ధులకు పెన్షన్ నిరాకరిస్తున్నారని, దీంతో వారు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలని కోరారు.

రామన్నపేట మండలంలో సీనియర్ సిటిజన్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుగా మండల కమిటీని సంప్రదించాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర కమిటీ ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా, సిరిపురం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అప్పం రామేశ్వరం, సీనియర్ సిటిజన్స్ మండల కార్యదర్శి కూనూరు సుదర్శన్, మండల ఉపాధ్యక్షుడు మిర్యాల భాస్కర్, నాయకులు మిర్యాల రామలింగం, రాపోలు లక్ష్మీనారాయణ, రాపోలు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆసరా పెన్షన్‌కు షరతులు వద్దు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలి: రాపోలు నరసింహ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News