Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు – కలెక్టర్ అనురాగ్ జయంతి

02-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

గురువారం భువనగిరి పరిధిలోని 31వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. జాతీయ గీతంతో సభను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చదివి వినిపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్‌బుక్కులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, డైట్ చార్జీల పెంపు వంటి పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.

రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలను ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వార్డుల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన విస్తరణ, విద్యార్థులకు మోటర్ వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రియ వ్యవసాయం వంటి నూతన పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, 31వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తబసుమ్, సంబంధిత అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు – కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News