Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:16 PM

అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలి ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులకు అవగాహన శిక్షణ

అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలి ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులకు అవగాహన శిక్షణ

అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలి ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులకు అవగాహన శిక్షణ
March 12, 2026 05:52 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన పెంపొందించుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి వాటి ప్రయోజనాలు చేరేలా చూడాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు.

గురువారం భువనగిరి పట్టణంలోని వి–కన్వెన్షన్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, చైర్‌పర్సన్‌లకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గేయం వందేమాతరం ఆలపించారు.

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగనున్న ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం పంపిణీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్మా ట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన పెంపొందించుకుని గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై దృష్టి సారించాలని సూచించారు. ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు.

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్మా ట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని పాటిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.

సెర్ప్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్మా ట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

జిల్లా ఎస్పీ అక్షణష్ యాదవ్మా ట్లాడుతూ ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల వినియోగం నియంత్రణపై గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జడ్పీ ప్రధాన కార్యనిర్వహణ అధికారి శోభారాణి, వివిధ మండలాల సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, చైర్‌పర్సన్‌లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News