Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:12 PM

అర్ధరాత్రి దొంగల హల్చల్.. రైతుల్లో ఆందోళన

21-07-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ట్రాక్టర్ల బ్యాటరీలు, మోటార్ కేబుళ్లపై కన్నేసిన కేటుగాళ్లు

రెండు రోజుల్లో వరుస చోరీలు.. పోలీసులకు ఫిర్యాదు.

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పిశాటిగూడెం, పేరేపల్లి, ఉరుమడ్ల గ్రామాల్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుసగా జరుగుతున్న చోరీలతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా వ్యవసాయ బావులు, పొలాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు.

పిశాటిగూడెం, పేరేపల్లి గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్ల నుంచి మూడు బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా పేరేపల్లి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ బ్యాటరీని కూడా అపహరించారు. తెల్లవారుజామున ట్రాక్టర్ల వద్దకు వెళ్లిన రైతులు బ్యాటరీలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

మరోవైపు ఉరుమడ్ల గ్రామంలోనూ దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అర్ధరాత్రి సమయంలో మూడు వ్యవసాయ పొలాల వద్ద మోటార్లకు అనుసంధానంగా ఉన్న కేబుళ్లను కత్తిరించి, అందులోని కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. గత రెండు రోజుల వ్యవధిలోనే ఆరు మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు.

వ్యవసాయ సీజన్‌లో వరుస చోరీలు జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళల్లో గ్రామాల్లో పోలీసు గస్తీని పెంచాలని, దొంగలను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనలపై బాధిత రైతులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.వ్యవసాయ పొలాలే లక్ష్యంగా మారుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో భద్రతపై రైతులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Sthanikam

అర్ధరాత్రి దొంగల హల్చల్.. రైతుల్లో ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News