Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి

11-03-2026 381 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: చేనేత వృత్తిలో పూటగడవక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.

బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ నూలు, రంగుల ధరలు పెరగడంతో పాటు నేసిన బట్టలకు సరైన ధరలు లేకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోజంతా కష్టపడి పనిచేసినా పూటగడవక అప్పులబాధలు పెరిగి చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నూలు, రంగులపై మాత్రమే కాకుండా నేసిన బట్టలపై కూడా జీఎస్టీ విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయని అన్నారు. చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా వంటి పథకాలు ప్రకటించి సంవత్సరంన్నర గడిచినా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.

చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా కూడా ఏళ్లుగా అందడంలేదని విమర్శించారు. మిర్యాల బాలరాజు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవడంతో పాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ముషం సత్యనారాయణ, ముషం శ్రీనివాసు, ఎలగందుల అంబాదాసు, కూరపాటి బిక్షపతి, ముషం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కుటుంబాన్ని ఆదుకోవాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News