Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:30 AM

అప్పు అడిగినందుకే యువకుడి హత్య

అప్పు అడిగినందుకే యువకుడి హత్య

అప్పు అడిగినందుకే యువకుడి హత్య
06-03-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చిత్తూరు మండలం తుమ్మిందపాళ్యం గ్రామంలో అప్పు వివాదం ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితుడికి ఇచ్చిన రూ.2 లక్షల అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు కాల్పులకు గురై యువకుడు మృతి చెందాడు.

గ్రామానికి చెందిన మునియప్ప కుమారుడు డిల్లీబాబు వ్యవసాయం చేస్తుండగా, మురుగేష్ కుమారుడు సాయికుమార్ (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ బంధువులు, స్నేహితులుగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం డిల్లీబాబు, సాయికుమార్ వద్ద నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో సాయికుమార్ పలుమార్లు డబ్బు కోరాడు. బుధవారం మరోసారి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన డిల్లీబాబు నాటు తుపాకీతో సాయికుమార్ ముఖంపై కాల్పులు జరిపాడు. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న చిత్తూరు తాలూకా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వేట కోసం తమిళనాడులో తుపాకీ కొనుగోలు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

అప్పు అడిగినందుకే యువకుడి హత్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News