Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:47 AM

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:
01-04-2026 166 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనుమతులు చూపాలి… లేకపోతే పోరాటం.

పర్యావరణ పరిరక్షణ వేదిక హెచ్చరిక

రామన్నపేటలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ పరిశ్రమ పనులు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డదారిలో కొనసాగిస్తే తీవ్ర ప్రజా పోరాటం తప్పదని పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు హెచ్చరించారు.

అదాని లాజిస్టిక్స్ లిమిటెడ్ పేరుతో అంబుజా సిమెంట్ కాలుష్య పరిశ్రమ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ వేదిక, అఖిలపక్షాల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు స్థలాన్ని పరిశీలించి పనులను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్ మాట్లాడుతూ… గతంలో ప్రజల తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన పరిశ్రమ నిర్వాహకులు మళ్లీ సాకులు చూపుతూ పనులు ప్రారంభించడం సరికాదని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో పనులు చేపడుతున్నారని, సంబంధిత అనుమతులను ప్రజలకు, మీడియా ముందు బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

స్థానిక గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అడ్డదారిలో పనులు కొనసాగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, మరోసారి భారీ స్థాయిలో ప్రతిఘటన చేపడతామని హెచ్చరించారు.

రైతులను మోసం చేసి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి కాలుష్య పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించిన విషయంపై జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గోదాస్ పృథ్వీరాజ్, ఊట్కూరు నర్సింహా, ఎండీ జమీరుద్దీన్, మిర్జా ఫజల్ బేగ్, శానగొండ వెంకటేశ్వర్లు, కొమ్ము శేఖర్, మోట మహేష్, సుదర్శన్, కొమ్ము రామస్వామి, అంబాల అశోక్, గురిజాల మహేష్ రెడ్డి, జల్లెల మల్లేష్, సమ్మయ్య, శీను, వీరమళ్ల లింగస్వామి, ఆకిటి శేఖర్, కల్లూరి శివ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

అనుమతులు లేకుండా పనులు చేస్తే సహించం:

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News