Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

అన్నెపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

12-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సర్పంచ్ పల్లవి ఆదేశం

నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పల్లవి అరవింద్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. సీతారాంపురం ఐకేపీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్రముల శైలజతో పాటు వార్డు సభ్యులు మట్టపల్లి రూప, కునుకుంట్ల నర్సింహ, కంభంపాటి వెంకటమ్మ, తోట వెంకట్ రెడ్డి, చర్లపల్లి కృష్ణ, బొగరి రామలింగస్వామి, నూకల దశరథ, గంగుల నాగమ్మ మోసంగి అంతయ్య, మామిడి లింగస్వామి , మట్టపల్లి అనిల్, ఎదుల ఇంద్రారెడ్డి, దొండ శేఖర్, నూకల సైదులు, నర్రముల నరసింహ, బదుల శేఖర్ తదితరులు, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పల్లవి అరవింద్ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ కేంద్రంలో తేమ శాతం మరియు తాలు పేరుతో అధికారులు, హమాలీలు రైతులను ఇబ్బంది పెట్టరాదని స్పష్టం చేశారు. రైతుల ధాన్యాన్ని పారదర్శకంగా, వేగంగా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా గ్రామ రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

అన్నెపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News