Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

అన్నదమ్ముల సివిల్స్ విజయం… సుంకేనపల్లి గ్రామం నుంచి జాతీయ స్థాయికి

07-03-2026 696 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకనపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు సివిల్స్ ఫలితాల్లో ప్రతిభ చాటుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు. వెలిమినేటి అంజిరెడ్డి, అలివేలు దంపతుల కుమారులు వేలిమినేటి విక్రమసింహారెడ్డి, విజయసింహారెడ్డి ఇద్దరూ యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి గ్రామానికి గౌరవం తీసుకొచ్చారు.

సివిల్స్ పరీక్షల్లో విక్రమసింహారెడ్డి 541వ ర్యాంక్ సాధించగా, విజయసింహారెడ్డి 682వ ర్యాంక్ పొందారు. ఇద్దరూ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి చిన్నప్పటి నుంచే సివిల్స్ లక్ష్యంగా కృషి చేశారు.

ఇటీవల నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో కూడా ఇద్దరూ మెరుగైన ప్రతిభకనబరిచారు.విక్రమసింహారెడ్డి గ్రూప్–1లో 208వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించగా, విజయసింహారెడ్డి 340వ ర్యాంక్ సాధించి మహబూబ్‌నగర్‌లో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు జాతీయ స్థాయి సివిల్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించడం గ్రామంలో ఆనందోత్సాహాలను నింపింది. సుంకనపల్లి గ్రామ ప్రజలు, బంధువులు, మిత్రులు వారికి అభినందనలు తెలుపుతూ వారి విజయాన్ని గర్వంగా భావిస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని ఈ అన్నదమ్ములు నిరూపించారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

అన్నదమ్ముల సివిల్స్ విజయం… సుంకేనపల్లి గ్రామం నుంచి జాతీయ స్థాయికి

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News