Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:36 AM

అన్నా క్యాంటీన్‌కు 1000 రోజులు – పెనుకొండలో వేడుకలు

18-04-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ, పెనుకొండలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి, ప్రజలకు భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, పేదలకు తక్కువ ధరలో భోజనం అందించాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడినట్టు తెలిపారు. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంటీన్లు నడిచాయని, ప్రస్తుతం కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక కేంద్రాల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

అన్నా క్యాంటీన్ ప్రారంభ సమయంలో పలు అడ్డంకులు ఎదురైనప్పటికీ సేవా కార్యక్రమాన్ని కొనసాగించామని ఆమె తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా పెనుకొండలో అధికారికంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా గోరంట్ల మండలంలో కూడా సొంత నిధులతో కొత్త క్యాంటీన్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

అన్నా క్యాంటీన్‌కు 1000 రోజులు – పెనుకొండలో వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News