Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

ఆన్‌లైన్‌లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు

02-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: జిల్లాలో ఇసుక సరఫరాను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి మైనింగ్ శాఖ అధికారులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం అవసరమైన ఇసుకను ఆన్‌లైన్ ద్వారానే పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలుకుతూ ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా చెక్ పడుతుందని చెప్పారు.

ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎక్కడైనా అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

మండల తహసీల్దార్లు, గ్రామపంచాయతీ అధికారులు గ్రామ ప్రజలకు ఆన్‌లైన్ బుకింగ్ విధానం పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ అధికారి సాయి కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఆన్‌లైన్‌లోనే ఇసుక సరఫరా.. అక్రమాలకు చెక్! జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News