Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం

02-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి-భువనగిరి: భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం వైభవంగా నిర్వహించారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు భగవన్నామ స్మరణతో ఆలయాన్ని మారుమోగించారు.

మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణ తంతు ఘనంగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ పంతులు, ధర్మకర్త సిరికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారు అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన క్షేత్రంలో స్వామివారు భక్తుల కోరికలను తీర్చే దైవంగా విశ్వాసం నెలకొందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత ధర్మకర్త సిరికొండ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, ఉపసర్పంచ్ వెలిశాల మురళి, గునుగుంట్ల శ్రీనివాస్, సిరికొండ అశోక్, నీలం భిక్షపతి, పిట్టల శ్రీశైలం, ఎదునూరి నరేష్, బొల్లేపల్లి మాణిక్యం, గోగు పోశాలు, గోద మల్లయ్య, ఎదునూరి వెంకటేశం, భాస్కర్ పంతులు, లింగయ్య తదితర ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News