Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 06:53 PM

అంతయ్యగూడెం వద్ద ఘోర ప్రమాదం కారు ఢీకొని వ్యక్తి మృతి..

04-04-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

యూ-టర్న్ తీసుకుంటుండగా మృత్యువు కబలింత..

మాడుగులపల్లి : నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు ఒక వాహనదారుడిని బలితీసుకుంది. ఈ ఘటనతో నామ్ ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాడుగులపల్లి టోల్‌గేట్ సమీపంలోని అంతయ్యగూడెం యూ-టర్న్ వద్ద శనివారం ఒక వాహనదారుడు తన వాహనాన్ని రోడ్డు దాటించేందుకు (యూ-టర్న్) ప్రయత్నిస్తున్నాడు.

అదే సమయంలో నామ్ ఎక్స్‌ప్రెస్ వేపై అతివేగంతో దూసుకొచ్చిన ఒక కారు సదరు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని సిరిగిరి రాంరెడ్డిగా గుర్తించారు. మృతదేహం రోడ్డుపై పడి ఉండటం, వాహనం నుజ్జునుజ్జు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎక్స్‌ప్రెస్ వేపై ప్రధాన కూడలి వద్ద ప్రమాదం జరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మాడుగులపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

Sthanikam

అంతయ్యగూడెం వద్ద ఘోర ప్రమాదం కారు ఢీకొని వ్యక్తి మృతి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News