Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

అమరావతి, విజయవాడ లో 100 విద్యుత్ బస్సులు

04-03-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ, అమరావతి రాజధాని ప్రాంత మార్గాల్లో 100 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

విద్యాధరపురం డిపోలో రూ.23 కోట్ల వ్యయంతో నిర్వహణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సివిల్ పనులకు రూ.12.5 కోట్లు, ఉపకేంద్రం మరియు ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.10.5 కోట్లు కేటాయించారు. 6,000 కెవిఎ సామర్థ్యంతో ఉపకేంద్రాన్ని నిర్మించి, 20 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు అందించగా, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం పీయం ఈ బస్ సేవా స్కీం కింద సమకూర్చుతోంది. మరో ఆరు నెలల్లో బస్సులు రోడ్లపైకి రానున్నట్లు సమాచారం.

మొత్తం 11 మార్గాలను గుర్తించి సేవలు ప్రారంభించనున్నారు. విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత పాత నగర బస్సులను దశలవారీగా తొలగించనున్నారు. ఈ బస్సులు ప్రారంభమైన తర్వాత రోజుకు సుమారు 7,000 లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించనున్నారు.

విద్యుత్ బస్సుల ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన వ్యయం గణనీయంగా తగ్గనుందని అధికారులు వెల్లడించారు.

Sthanikam

అమరావతి, విజయవాడ లో 100 విద్యుత్ బస్సులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News