Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:57 AM

అమ్మలా అన్న క్యాంటీన్లు.. రోజుకు 2.72 లక్షల మందికి భోజనం: మంత్రి సవిత

అమ్మలా అన్న క్యాంటీన్లు.. రోజుకు 2.72 లక్షల మందికి భోజనం: మంత్రి సవిత

అమ్మలా అన్న క్యాంటీన్లు.. రోజుకు 2.72 లక్షల మందికి భోజనం: మంత్రి సవిత
April 20, 2026 07:33 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం N. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్లు అమ్మలా పేదలకు మూడు పూటలా భోజనం అందిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ల ద్వారా రోజుకు సుమారు 2.72 లక్షల మంది పేదలు, కార్మికులు భోజనం చేస్తున్నారని వివరించారు.

ఎన్నికల హామీ మేరకు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, ప్రస్తుతం రాష్ట్రంలో 269 క్యాంటీన్లు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. పెనుకొండలో తాను వెయ్యి రోజుల పాటు సొంత నిధులతో అన్న క్యాంటీన్ నిర్వహించానని, ఎన్నో అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయలేదని చెప్పారు. అప్పట్లో హేళన చేసినవారి నోళ్లు ఇప్పుడు మూయించామని పేర్కొన్నారు.

మాజీ సీఎం Y. S. జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్న క్యాంటీన్లు మూసివేయడం వల్ల పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పునరుద్ధరించామని తెలిపారు.

త్వరలో గోరంట్లలో కూడా సొంత నిధులతో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం జన్మదిన సందర్భంగా నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చి ఒక రోజు ఉచిత భోజనం అందించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News