Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:25 AM

అమ్మ ఒడికి దూరమైన పసిప్రాణం.. న్యాల్కల్‌లో ముళ్లపొదల్లో నవజాత శిశువు

03-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

పీహెచ్సీ వెనుక తెల్లవారుజామున వినిపించిన పసికందు ఏడుపు.. స్థానిక మహిళ చొరవతో శిశువు రక్షణ, బాధ్యుల కోసం పోలీసుల దర్యాప్తు

న్యాల్కల్,

పుట్టి కొన్ని గంటలే అయిన ఓ నవజాత శిశువు తల్లి ఒడిలో కాకుండా ఆసుపత్రి వెనుక ముళ్లపొదల్లో కనిపించడం స్థానికులను కలచివేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందడి మధ్య సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది.తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో న్యాల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వెనుక భాగంలో గల ముళ్లపొదల్లో నుంచి పసికందు ఏడుపు వినిపించింది. కాలకృత్యాల కోసం వెళ్లిన మాణిక్ నగర్ కాలనీ కి చెందిన టేకు లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా అప్పుడే జన్మించిన మగ శిశువు కనిపించాడు.చలికి వణుకుతున్న ఆ పసిబాలుడిని ఆమె అక్కున చేర్చుకుని ఇంటికి తీసుకెళ్లి శుభ్రపరిచింది. అనంతరం ఈ విషయాన్ని కాలనీ వాసులు పోలీసులకు, వైద్య సిబ్బందికి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వైద్యాధికారి డాక్టర్ అమృతరాజ్‌తో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును పరిశీలించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స, సంరక్షణ కోసం శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఏఎన్‌ఎం సరళ, ఆశా వర్కర్ వినోద్, టేకు లక్ష్మి తదితరుల సమక్షంలో 108 అంబులెన్స్ ద్వారా శిశువును సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా, శిశువును అక్కడ వదిలివెళ్లిన వారు ఎవరు? ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ బాధ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తల్లి ఒడిలో ఉండాల్సిన పసిప్రాణం ముళ్లపొదల్లో కనిపించడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

అమ్మ ఒడికి దూరమైన పసిప్రాణం.. న్యాల్కల్‌లో ముళ్లపొదల్లో నవజాత శిశువు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News