Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం ​

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం ​

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం ​
16-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా (ఏప్రిల్ 14 నుండి 20 వరకు) గురువారం శాంతినగర్ కాలనీలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రమాదాలకు కారణాలు - నివారణ మార్గాలు:

ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్ర అధికారి బి. శివాజీ మాట్లాడుతూ.. వేసవిలో చిన్నపాటి అజాగ్రత్త కూడా పెను ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.​బీడీలు, సిగరెట్లు కాల్చి ఆర్పకుండా పడేయడం వల్ల ఎండుగడ్డి వాములు, చెత్త కుప్పలు తగలబడి ఇళ్లకు వ్యాపించే ప్రమాదం ఉంది.

​గృహాల్లో గ్యాస్ సిలిండర్ల వినియోగంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.​విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల పట్ల నిరంతరం నిఘా ఉంచాలి.​అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను, మంటలను ఆర్పే విధానాలను సిబ్బంది స్థానికులకు వివరించారు.ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్లు ఆర్. అనిల్ కుమార్, జి. నాగేశ్వరావు, సిబ్బంది డి. దిలీప్, టి. ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

Sthanikam

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం ​

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News