Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:32 AM

ఆదోని జిల్లా సాధనలో ప్రభుత్వమా? ప్రజా ఉద్యమమా? ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం: జేఏసీ పిలుపు

20-04-2026 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 155వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 155వ రోజు దీక్షలో ఏఐఎఫ్టీయూ నాయకుడు గంగన్న, జనసేన నాయకుడు ఈరన్న, రైతు కూలీ సంఘం ప్రతినిధులు రామలింగ, పాండురంగ నాగరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు కోదండ మాట్లాడుతూ, పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలు—ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం—ప్రజల అభివృద్ధి కోసం ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఏర్పాటు ద్వారా వలసలు తగ్గుతాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, చేతివృత్తుల వారికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని చెప్పారు.

అదేవిధంగా పరిపాలన సౌలభ్యం పెరగడం, కొత్త పరిశ్రమలు స్థాపన, విద్యా మరియు వైద్య సదుపాయాలు ప్రజలకు మరింత చేరువ కావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ పోరాటంలో ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాసంఘాలు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, అన్ని వర్గాల వారు కలిసి ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

“మేము సైతం” అనే నినాదంతో ఒక్కరోజైనా ఉద్యమంలో పాల్గొని ఆదోని జిల్లాను సాధించుకుందాం అని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్ర, కుమార్, రామకృష్ణ, గాజుల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోని జిల్లా సాధనలో ప్రభుత్వమా? ప్రజా ఉద్యమమా? ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం: జేఏసీ పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News