Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:37 PM

ఆధునిక చేపల పెంపకంపై మూడు రోజుల శిక్షణ పూర్తి

07-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బయోఫ్లాక్ చేపల సాగుపై మత్స్య రైతులకు అవగాహన

పాలేరు: మత్స్యకారులు, మత్స్య రైతులకు ఆధునిక చేపల సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు పాలేరు మత్స్య పరిశోధన స్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది.

మత్స్య పరిశోధన స్థానం పాలేరు, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఆధ్వర్యంలో, భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఆర్థిక సహకారంతో “బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు” అంశంపై ఈ శిక్షణ నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాయకన్ గూడెం శాఖ మేనేజర్ ఎల్. రవికుమార్ మాట్లాడుతూ మత్స్య రైతులు శాస్త్రవేత్తలు సూచించిన బయోఫ్లాక్ సాగు పద్ధతులను పాటించి మంచి లాభాలు పొందాలని సూచించారు. అలాగే భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

మత్స్య పరిశోధన స్థానం అధిపతి, సీనియర్ మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఎం. శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను రైతులు ఆచరణలో పెట్టి అధిక దిగుబడులు సాధించాలని కోరారు.

మత్స్య శాస్త్రవేత్త బి. రవీందర్ మాట్లాడుతూ బయోఫ్లాక్ చేపల సాగులో నీటి నాణ్యత ప్రమాణాలు అయిన పీహెచ్, ప్రాణవాయువు, అమ్మోనియా, నైట్రైట్, నీటి కాఠిన్యత, ఆల్కలినిటీ వంటి అంశాల ప్రాముఖ్యతపై వివరించారు. అలాగే క్షేత్రస్థాయిలో బయోఫ్లాక్ యూనిట్ నుంచి నీటి నమూనాలు సేకరించి కిట్ల సహాయంతో నీటి నాణ్యత పరీక్షలు చేయడం చూపించారు.

యువ నిపుణుడు సిగ నాగరాజు మాట్లాడుతూ బయోఫ్లాక్ విధానంలో సాధారణంగా వచ్చే వ్యాధులు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ పథకాల గురించి రైతులకు వివరించారు.

మత్స్య శాస్త్రవేత్త పి. శాంతన్న బయోఫ్లాక్ చేపల సాగులో పాటించవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో బానోతు దివ్య, డాక్టర్ కె. అరుణ్ కుమార్, సిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆధునిక చేపల పెంపకంపై మూడు రోజుల శిక్షణ పూర్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News