Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి

02-04-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని, వెంటనే నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీపీఎం నేతలు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కోరారు. గురువారం కలెక్టర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ— సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రి భవనం ప్రస్తుతం పెచ్చులూడుతూ ఎప్పుడైనా కూలే ప్రమాదంలో ఉందన్నారు. వెంటనే రూ.40 కోట్లు మంజూరు చేసి 100 పడకల సదుపాయంతో నూతన ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే కనీస మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. పలుమార్లు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు.

ఇక రామన్నపేట పరిధిలో అంబుజా అదాని సిమెంట్ పరిశ్రమ ప్రతిపాదిత ప్రాజెక్టుపై ప్రజలు ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, కందుల హనుమంతు, గన్నేబోయిన విజయభాస్కర్, గొరిగే సోములు, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము, జల్లెల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News