Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీపీఎం రాజకీయ శిక్షణతోనే పార్టీ బలోపేతం! రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 06:18 AM

అభివృద్ధి ప్రదాత రాజగోపాల్ రెడ్డి అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్..

అభివృద్ధి ప్రదాత రాజగోపాల్ రెడ్డి అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్..

అభివృద్ధి ప్రదాత రాజగోపాల్ రెడ్డి అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్..
April 03, 2026 06:20 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ప్రాజెక్టులు తెచ్చింది కోమటిరెడ్డి సోదరులే పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క పైసా ఇవ్వలేదు..

మునుగోడులో 165 మందికి రూ.48.37 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..


మునుగోడు : మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజగోపాల్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని అటువంటి వారిని 'తొక్కి నారతీస్తాం' అని హెచ్చరించారు. శుక్రవారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 165 మంది లబ్ధిదారులకు రూ.48,37,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలనే దీర్ఘ దృష్టితో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును తీసుకొచ్చిన ఘనత కోమటిరెడ్డి సోదరులదేనని స్పష్టం చేశారు. పదేళ్లపాటు అధికారాన్ని వెలగబెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ప్రాజెక్టుకు ఒక్క పైసా నిధులు కూడా కేటాయించకుండా తన నీచ బుద్ధిని చాటుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ప్రత్యేక నిధులు మంజూరు చేసి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేశామని గర్వంగా చెప్తున్నామన్నారు. మునుగోడు మండలానికి నీటిని మళ్లించేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని గత వేసవిలో ప్రభుత్వం నుండి నిధులు రాకముందే తన సొంత ఖర్చుతో కాలువలు తవ్వించి పులిపలుపుల చెరువుకు నీటిని తెచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం కమిషన్ల కోసమే రిజర్వాయర్ల కట్టలు కట్టి వదిలేశారని, ఆ రిజర్వాయర్లకు ఎదుల నుండి నీటిని మళ్లించేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో 1800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పేదల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సామాజిక సేవలో ఆయన ముందున్నారని తెలిపారు. సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రభుత్వ పథకాలను కూడా ఎంతో పారదర్శకంగా, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్న గొప్ప మానవతావాది రాజగోపాల్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News