Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

అంబేద్కర్ ఆశయాల సాధనే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళులు

15-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మనం అనుభవించే రాజ్యాంగ ఫలాలు అంబేద్కర్ త్యాగాల తోనే.....

రేపాల గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని రేపాల గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రేపాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ..సమాజంలోని అంటరానితన్నాన్ని నిర్మూలించేందుకు అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు.అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు.అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు.సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఆయన చూపిన బాటలో నడిస్తేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అంటరానితనంపై పోరాడి మహిళలు, దళితుల హక్కుల కోసం కృషి చేసిన అంబేద్కర్, పేదల పాలిట ఆశాజ్యోతి అని కొనియాడారు. మతం కన్నా మానవత్వమే గొప్పదని చాటిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ఉపసర్పంచ్, ప్రాథమిక వైద్యశాల డాక్టర్, పశు వైద్యశాల డాక్టర్, పలువురు వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Sthanikam

అంబేద్కర్ ఆశయాల సాధనే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News