ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు
141 టన్నుల ఇసుక స్వాధీనం, ఇద్దరు డ్రైవర్లపై కేసు
ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం 8 గంటల ప్రాంతంలో మల్కాపురం గ్రామం పరిధిలో పోలీసులు, గనుల శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.ఆ సమయంలో ఏపీ వైపు నుంచి వస్తున్న రెండు లారీలను ఆపి పరిశీలించగా, ఎలాంటి ఆధారాలు, అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. AP 39WC 6179 లారీలో 69.77 టన్నుల ఇసుకను రవాణా చేస్తున్న డ్రైవర్ ఎస్.కె. బాబావలిని అదుపులోకి తీసుకున్నారు.AP 37UG 3889 లారీలో 71.49 టన్నుల ఇసుకను తరలిస్తున్న డ్రైవర్ జానీ భాషను పట్టుకున్నారు.మొత్తం 141.26 టన్నుల ఇసుకతో పాటు రెండు లారీలను సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కే.రాఘవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి