నేలకొండపల్లి, మండలంలోని రాయిగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బోయిన వేణు స్వయంగా పాల్గొని గ్రామంలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఇళ్ల ఆవరణల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించేలా చర్యలు తీసుకున్నారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ సూరేపల్లి ప్రేమ్ కుమార్, నాయకులు బైరు లక్ష్మీనారాయణ, లక్క నాగరాజు, కాలింగ్ వీరబాబు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి