Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:14 PM

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ప్రారంభం వార్డుల సమస్యలకు తక్షణ పరిష్కారం చైర్మన్ గీత రమేష్

06-03-2026 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 12 వార్డుల్లో ఉన్న పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి సరఫరా లోపాలు, వీధిదీపాల నిర్వహణతో పాటు కొద్ది రోజులుగా పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రజా సమస్యలను గుర్తించితక్షణమేపరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రత్యక్షంగా స్వీకరించి వాటిని వేగంగా పరిష్కరించే దిశగా అధికారులు, సిబ్బందితో కలిసి కార్యాచరణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా 12వ వార్డులోని ప్రభుత్వ పాఠశాల వెనుక కాలనీలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. కాలనీలో చెత్త తొలగింపు, కాలువల శుభ్రత వంటి పనులను మున్సిపల్ సిబ్బంది చేపట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, కమిషనర్ దండు శ్రీను, కౌన్సిలర్లు కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, దేశపాక లతా రాజేష్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, ఎద్దులపూరి కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ప్రారంభం వార్డుల సమస్యలకు తక్షణ పరిష్కారం చైర్మన్ గీత రమేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News