Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

76 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు: మంత్రి సవిత

20-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సీఎం N. చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో 76 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు ఘనంగా జరిపించారు.

ఈ సందర్భంగా గర్భిణీలకు ఆశీర్వాదాలు అందజేసి, వస్త్రాలు పంపిణీ చేశారు. తల్లి మరియు శిశు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి తెలిపారు. మహిళల సంక్షేమం, గర్భిణీల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

76 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు: మంత్రి సవిత

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సీఎం N. చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో 76 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు ఘనంగా జరిపించారు.

ఈ సందర్భంగా గర్భిణీలకు ఆశీర్వాదాలు అందజేసి, వస్త్రాలు పంపిణీ చేశారు. తల్లి మరియు శిశు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి తెలిపారు. మహిళల సంక్షేమం, గర్భిణీల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News