పాల్గొన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట మున్సిపాలిటీ 30వ వార్డులో స్థానిక నాయకుడు గాలి సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోగి పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో, సాంస్కృతిక వైభవంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, బోగి–సంక్రాంతి పండుగలు తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. ఇలాంటి వేడుకలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బడుగుల లింగయ్య యాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి