Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 07:34 PM

13న కామేపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన భారీ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి: మేకల మల్లిబాబు యాదవ్

13న కామేపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన భారీ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి: మేకల మల్లిబాబు యాదవ్

13న కామేపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన భారీ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి: మేకల మల్లిబాబు యాదవ్
March 12, 2026 03:49 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఈనెల 13న కామేపల్లి మండలంలో జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో పాటు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరుకానున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా పండితాపురం పశువుల సంత నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కామేపల్లి మాజీ జెడ్పిటిసి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్తె లిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పొంగులేటి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా బిల్లులు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దక్కుతుందని అన్నారు. అలాగే ఇల్లందు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్యకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొమనేపల్లి గ్రామ ఉప సర్పంచ్ మేకల మల్లికార్జునరావు, వార్డు సభ్యులు ధరావతలాలు నాయక్, ఎస్.కె. రబ్బానీ పాషా, మండల కాంగ్రెస్ నాయకులు గుగులోతు రవి, డేరంగుల తిరపయ్య, మొగిలి శ్రీను, మేకల లక్ష్మీనారాయణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News