Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 06:45 AM

100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలంటూ నిరాహార దీక్షకు పిలుపు

15-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు నిధులు కేటాయిస్తున్నామని ప్రతి సారి ప్రకటించినప్పటికీ, ఆ నిధులు గ్రామీణ ఆసుపత్రులకు పూర్తిగా చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రామన్నపేట ఆసుపత్రిపై పరిసర మండలాల ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రతి వారం సుమారు 15 మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందుతున్నప్పటికీ, తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.

ప్రభుత్వం తక్షణం స్పందించి రామన్నపేట తాలూకా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి అవసరమైన నిధులు మంజూరు చేస్తే వందలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని ప్రజలు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య హక్కుల సాధన కోసం మార్చి 16న రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామంలోని చైతన్యవంతులు, విద్యావంతులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలంటూ నిరాహార దీక్షకు పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News