Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

యువతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన హద్నూర్ పోలీస్ సేవలు

26-01-2026 383 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

సంగారెడ్డి జిల్లా హద్నూర్ మండలానికి చెందిన ఒక యువతి, పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసి, ప్రేమ విఫలమైందనే కారణంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది.ఈ విషయాన్ని గమనించిన జిల్లా స్థాయి సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ సిబ్బంది, వెంటనే హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సుజిత్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఐ సుజిత్ ఎలాంటి ఆలస్యం చేయకుండా తన సిబ్బందితో కలిసి యువతి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, వ్యవసాయ పొలాల్లో ఉన్న ఆమె వద్దకు చేరుకున్నారు.యువతితో ఓర్పుగా, సానుభూతితో మాట్లాడిన ఎస్‌ఐ సుజిత్, ప్రేమ విఫలమైనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదని, అది జీవితంలో ఎదురయ్యే ఒక దశ మాత్రమేనని వివరించారు. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, విద్యపై దృష్టి సారించి, భవిష్యత్తును సక్రమంగా నిర్మించుకోవాలని ఆమెకు ధైర్యం చెప్పారు.ఎస్‌ఐ ఇచ్చిన నచ్చచెప్పడంతో యువతి మనసు మారడంతో, ఆమెను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.ఈ ఘటనలో తమ కుమార్తె ప్రాణాలను కాపాడిన హద్నూర్ ఎస్‌ఐ సుజిత్‌కు, పోలీస్ సిబ్బందికి యువతి తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమయానికి స్పందించి, మానవత్వంతో వ్యవహరించిన పోలీస్ శాఖపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

Sthanikam

యువతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన హద్నూర్ పోలీస్ సేవలు

Article Image

మీ స్పందన? 9 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News