Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:35 AM

యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల సరఫరా

యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల సరఫరా

యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల సరఫరా
10-04-2026 144 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు “యూరియా బుకింగ్ యాప్” ద్వారా పంపిణీ కొనసాగుతున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ తెలిపింది. గత యాసంగి సీజన్‌లో ప్రారంభించిన ఈ విధానం రాబోయే ఖరీఫ్-2026 సీజన్‌లో కూడా అమలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రైతులు తమ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. మొబైల్ నంబర్ మార్పు అవసరమున్న రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ను సంప్రదించి వివరాలు నవీకరించుకోవచ్చు.

జిల్లాలో పనిచేస్తున్న ADAలు, MAOలు, AEOలు విస్తృత ప్రచారం చేపట్టి, ఏప్రిల్ 20లోపు రైతుల మొబైల్ నంబర్లు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువులు పొందాలంటే ప్రస్తుత మొబైల్ నంబర్ నమోదు తప్పనిసరి అని తెలిపారు. అందువల్ల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, నిర్ణీత గడువులోపు తమ మొబైల్ నంబర్లను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పి.వి. రమణా రెడ్డి సూచించారు.

Sthanikam

యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల సరఫరా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News